logo

అతిథి అధ్యాపకుల సేవలు కొనసాగించాలి

రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల సేవలను 2023-24 విద్యా సంవత్సరానికి కొనసాగించాలని తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్‌ నీల వెంకటేశ్‌ కోరారు.

Published : 27 Sep 2023 02:47 IST

మంత్రి సబితారెడ్డికి వినతిపత్రమిస్తున్న వెంకటేశ్‌, కిశోర్‌కుమార్‌

కాచిగూడ: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల సేవలను 2023-24 విద్యా సంవత్సరానికి కొనసాగించాలని తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్‌ నీల వెంకటేశ్‌ కోరారు. 1940 మందిని రెన్యువల్‌ చేయకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ విషయమై మంగళవారం ఆయన తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు డాక్టర్‌ కిశోర్‌కుమార్‌తో కలిసి సచివాలయంలో మంత్రి సబితారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. వీరికి పని గంటల ప్రాతిపదికన కాకుండా నెలవారీగా వేతనాలను ఇవ్వాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని