logo

ప్రపంచ నగరాలకు దీటుగా హైదరాబాద్‌: తలసాని

ప్రపంచ నగరాలకు దీటుగా హైదరాబాద్‌ తయారవుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. హుస్సేన్‌సాగర్‌ లేక్‌ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, దీనికి కారణం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచనలను అధికారులు తు.చ. తప్పకుండా ఆచరించడమేనన్నారు.

Published : 27 Sep 2023 02:47 IST

పార్క్‌ను పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌, అర్వింద్‌కుమార్‌ తదితరులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ప్రపంచ నగరాలకు దీటుగా హైదరాబాద్‌ తయారవుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. హుస్సేన్‌సాగర్‌ లేక్‌ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, దీనికి కారణం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచనలను అధికారులు తు.చ. తప్పకుండా ఆచరించడమేనన్నారు. నెక్లెస్‌ రోడ్డు (పీవీ మార్గ్‌)లో పది ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.26.5 కోట్ల వ్యయంతో రూపొందించిన లేక్‌ ఫ్రంట్‌ పార్క్‌ను మంగళవారం రాత్రి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్‌ పరిధిలో అద్భుతమైన ప్రాజెక్టులు ఉన్నాయని, అంతర్జాతీయ స్థాయిలో స్టీల్‌ వంతెన, లేక్‌ ఫ్రంట్‌ పార్క్‌లో అనేక రకాల చెట్లు, సచివాలయం, అంబేడ్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారకం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు.  పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ మాట్లాడుతూ రష్యాలో నీటిపై ఉన్న వాక్‌వే మాదిరి ఇక్కడా పెడితే బాగుంటుందన్న ఆలోచనతో లేక్‌ పార్కు  ఏర్పడిందన్నారు. అనంతరం మంత్రి అధికారులతో కలిసి పార్కులో కలియదిరిగారు. అర్బన్‌ ఫారెస్ట్‌ విభాగం డైరెక్టర్‌ ప్రభాకర్‌, హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ పరంజ్యోతి ఉన్నారు.

విద్యుత్తు దీపాల వెలుగుల్లో పార్క్‌ వ్యూ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు