logo

2035 నాటికి హైదరాబాద్‌ జీడీపీ 200 బిలియన్‌ డాలర్లు

హైదరాబాద్‌ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని.. ఎన్నికలు వచ్చినా ఆగేది ఉండదని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో), తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు బి.సునీల్‌ చంద్రారెడ్డి, ఎం.విజయసాయి అన్నారు.

Updated : 27 Sep 2023 05:13 IST

నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు సునీల్‌చంద్రారెడ్డి

మాట్లాడుతున్న బి.సునీల్‌చంద్రారెడ్డి, చిత్రంలో  విజయసాయి

ఈనాడు, హైదరాబాద్‌, బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని.. ఎన్నికలు వచ్చినా ఆగేది ఉండదని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో), తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు బి.సునీల్‌ చంద్రారెడ్డి, ఎం.విజయసాయి అన్నారు. ప్రపంచవ్యాప్తంగానూ హైదరాబాద్‌ నగరంపై ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగిందని.. వారంలో రెండు మూడు కంపెనీలు వస్తున్నాయని అన్నారు. నరెడ్కో 13వ ప్రాపర్టీ షో వివరాలు వెల్లడించేందుకు మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి ఉపాధితో ముడిపడి ఉందని.. గత రెండేళ్లలో దేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగాలు ఇక్కడే వచ్చాయని సునీల్‌చంద్రారెడ్డి అన్నారు.  ప్రస్తుతం హైదరాబాద్‌ జీడీపీ 50 బిలియన్‌ డాలర్లు ఉండగా... 2035 నాటికి 200 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ అంచనా వేసిందన్నారు. నగరంలో ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఆరేడేళ్ల తర్వాత ఐటీ కారిడార్‌ వైపు వచ్చినవాళ్లు హైదరాబాద్‌ అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతున్నారని నరెడ్కో ప్రధాన కార్యదర్శి ఎం.విజయసాయి అన్నారు.

6,7,8 తేదీల్లో ప్రాపర్టీ షో.. 13వ ప్రాపర్టీ షోను అక్టోబరు 6 నుంచి 8 వరకు హైటెక్స్‌లో నిర్వహిస్తున్నామని నరెడ్కో తెలంగాణ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కె.శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో కోశాధికారి కాళీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని