logo

అగ్నికణిక చాకలి ఐలమ్మ

భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటంలో అగ్నికణిక చాకలి చిట్యాల ఐలమ్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఘనంగా నివాళులర్పించారు.

Published : 27 Sep 2023 02:47 IST

ఉత్సవాలు ప్రారంభిస్తున్న మంత్రి కమలాకర్‌

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటంలో అగ్నికణిక చాకలి చిట్యాల ఐలమ్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.  కమిటీ ఛైర్మన్‌ అక్కరాజు శ్రీనివాస్‌ అధ్యక్షతన తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, బీసీ కమిషన్‌ సభ్యులు ఉపేందర్‌, కిషోర్‌గౌడ్‌, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, కమిటీ ప్రతినిధులు గోపీ రజక తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని