logo

ఉపకార వేతన బకాయిల విడుదలకు వినతి

రాష్ట్రంలోని బీసీ విద్యార్థుల ఉపకార వేతల బకాయిలు రూ. 5 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్‌యాదవ్‌ కోరారు.

Published : 27 Sep 2023 02:46 IST

మంత్రి కమలాకర్‌కు వినతిపత్రం అందజేస్తున్న రాజేశ్వర్‌యాదవ్‌, నేతలు

గోల్నాక, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని బీసీ విద్యార్థుల ఉపకార వేతల బకాయిలు రూ. 5 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్‌యాదవ్‌ కోరారు. బీసీ బంధు ద్వారా ఒక్కో పేద కుటుంబానికి రూ. 10 లక్షల సహాయాన్ని అందజేయాలన్నారు. ఈ విషయమై మంగళవారం ఆయన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్‌చారి, కార్యదర్శి రవీందర్‌యాదవ్‌ తదితరులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్‌కు బంజారాహిల్స్‌లోని నివాసం వద్ద వినతిపత్రాన్ని అందజేశారు. నియమిత పదవుల్లో 50 శాతం బీసీలకు కేటాయించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని