logo

Telangana Elections: పాట క్లిక్‌.. ప్రచారం హిట్‌!

ఒక పాట ఎన్నోవేల మాటలకు మించిన భావాన్ని వ్యక్తం చేస్తుంది.. విషయాన్ని సూటిగా చేరేలా చేస్తుంది.. అలాంటి పాటను  అభ్యర్థులు ప్రచారంలో వినియోగిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.  లక్షల్లో వ్యూస్‌ కూడా వస్తుండటంతో అభ్యర్థులు మరిన్ని పాటలతో ఓటర్ల ముందుకు వస్తున్నారు.

Updated : 21 Nov 2023 07:25 IST

ఒక పాట ఎన్నోవేల మాటలకు మించిన భావాన్ని వ్యక్తం చేస్తుంది.. విషయాన్ని సూటిగా చేరేలా చేస్తుంది.. అలాంటి పాటను  అభ్యర్థులు ప్రచారంలో వినియోగిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.  లక్షల్లో వ్యూస్‌ కూడా వస్తుండటంతో అభ్యర్థులు మరిన్ని పాటలతో ఓటర్ల ముందుకు వస్తున్నారు. గతంలో గోడలపై రాతలు, కరపత్రాలు పంచటం లాంటి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. డిజిటల్‌ యుగంలో ప్రచార వ్యుహాలు మారుతున్నాయి. ఆకట్టుకునే పాటలతో సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీలు కళాకారులతో ప్రత్యేక గీతాలను రికార్డు చేయించి వాటిని అభ్యర్థులకు అందిస్తున్నాయి. దీంతో పలువురు కళాకారులకు ఉపాధి మార్గంగా మారుతోంది. బాణీల నుంచి పాట రూపకల్పనకు ఒక్కో పాటకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. ఈ రంగంలోనూ పోటీ పెరిగిపోయిందని కళాకారుడు దరువు అంజన్న తెలిపారు.  

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని