logo

రూ.7 కోట్లు వసూలు చేసి మరొకరికి కాంట్రాక్టు

మణికొండ చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీలో మరో కుంభకోణం బయపడింది. సొసైటీ భూముల్లో ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం పేరుతో హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ తన దగ్గర రూ.7 కోట్లు వసూలు చేశారని ఓ కాంట్రాక్టరు సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారుల్ని ఆశ్రయించారు.

Published : 13 Jun 2024 02:18 IST

చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు అనిల్‌పై మరో ఫిర్యాదు

 ఈనాడు, హైదరాబాద్‌: మణికొండ చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీలో మరో కుంభకోణం బయపడింది. సొసైటీ భూముల్లో ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం పేరుతో హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ తన దగ్గర రూ.7 కోట్లు వసూలు చేశారని ఓ కాంట్రాక్టరు సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారుల్ని ఆశ్రయించారు.  రాయదుర్గం ప్రాంతానికి చెందిన రత్నశ్రీరంగ జాయింట్‌ వెంచర్స్‌ భాగస్వామి వైఎల్‌ అమర్‌నాథ్‌బాబు(57) కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నారు. చిత్రపురికాలనీలో సినీ కార్మికుల కోసం 3.20 ఎకరాల విస్తీర్ణంలో జంట భవనాల (ట్విన్‌ టవర్స్‌) నిర్మాణ కాంట్రాక్టు చేపట్టాలని ఆయనకు ఒ.కళ్యాణ్‌బాబు ద్వారా సమాచారం అందింది. రత్న శ్రీ రంగ సంస్థ పేరిట 2023 ఫిబ్రవరిలో భవన నిర్మాణ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది మార్చిలో అమర్‌నాథ్‌బాబు తన సంస్థ ఖాతా నుంచి అడ్వాన్సు కింద రూ.3.20 కోట్లు హౌసింగ్‌ సొసైటీ ఖాతాకు బదిలీ చేశారు. తర్వాత  వల్లభనేని అనిల్‌కుమార్‌ హెచ్‌ఎండీఏ అనుమతులు పేరిట రూ.1.80 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా ఓ మధ్యవర్తి ఇంట్లో నగదు రూపంలో చెల్లించారు.  మరో రూ.1.80 కోట్లు కళ్యాణ్‌ ఆర్ట్స్‌ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. అనంతరం అనిల్‌కుమార్‌ డిమాండ్‌ మేరకు మధ్యవర్తిత్వం చేసిన కళ్యాణ్‌కు రూ.20 లక్షలు చెల్లించారు. తనను ఉద్దేశపూర్వంగా మోసం చేసిన అనిల్, మధ్యవర్తి కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని అమర్‌నాథ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్విన్‌ టవర్ల  నిర్మాణానికి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని