logo
Published : 29/11/2021 06:39 IST

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి


పోరుమామిళ్లలో శవంతో రహదారిపై బైఠాయించిన సీపీఐ నాయకులు

బి.కోడూరు, పోరుమామిళ్ల న్యూస్‌టుడే : బి.కోడూరు మండలంలోని రెడ్డివారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన మొలతాటి బాలపెంచలయ్య (29) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి అన్న, బంధువులు ఇది హత్యేనని చెబుతున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని స్థానిక ఎస్సై నస్రీన్‌ తెలిపారు. వివరాలు పరిశీలిస్తే బాలపెంచలయ్య శనివారం తన మిత్రుడితో కలసి ఐత్రంపేట కొండ సమీపంలోని కల్వర్టు వద్దకు మద్యం తాగేందుకు వెళ్లారు. ఆయన భార్య పలుమార్లు ఫోను ద్వారా యత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన స్నేహితుడి ద్వారా సమాచారం తెలుసుకుని కల్వర్టు వద్దకు వెళ్లి చూడగా అప్పటికే సృహ కోల్పోయిన స్థితిలో బాలపెంచలయ్యను గుర్తించారు. పోరుమామిళ్ల ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. నాలుగు రోజుల క్రితం రెడ్డివారిపల్లెకి చెందిన రమణారెడ్డ్డి గొడవ జరిగిందని తమ తమ్ముడ్ని వారే చంపి అక్కడ పడేసి ఉంటారని మృతుడి అన్న నరసింహులు అనుమానం వ్యక్తం చేశారు. బాధ్యులపై కేసు నమోదు చేసి శిక్షించాలని పోరుమామిళ్ల ఆసుపత్రి వద్ద సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. దీంతో సీఐ మోహన్‌రెడ్డి కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు.

హంతకులను కఠినంగా శిక్షించాలి ; హంతకులను కఠినంగా శిక్షించాలని సీపీఐ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌ డిమాండు చేశారు. శవంతో పోరుమామిళ్ల వైఎస్‌ఆర్‌ విగ్రహం కూడలి వద్ద ఆదివారం రాస్తారోకో చేశారు. నాయకులు రవికుమార్‌, పిడుగు.మస్తాన్‌, ముత్యాల.ప్రసాదు, కార్యకర్తలు, బాధిత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని