Published : 29 Nov 2021 06:39 IST
826 మంది విద్యార్థులకు ప్రవేశాలు
విద్యార్థులకు మంత్రణం నిర్వహిస్తున్న అధికారులు
వేంపల్లె, న్యూస్టుడే: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. డైరెక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రవేశాలల్లో ఆదివారం 826 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. నూజివీడు, ఇడుపులపాయ కేంద్రంగా నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఉన్న 4,400 సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న ఈ మంత్రణం డిసెంబరు రెండో తేదీ వరకు సాగనుంది. కార్యక్రమంలో ఏవో కొండారెడ్డి, అకడమిక్ డీన్ రమేష్, ఐటీ నిపుణులు జ్ఞానవెంకట్, లింగమూర్తి, పీఆర్వో డా.తిరుపతిరెడ్డి, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags :