ప్రతిభ చూపితేనే ఉన్నత స్థానాలకు
ప్రశ్నపత్రాల ఆవిష్కరణలో ప్రభాకర్‌రెడ్డి, జవివే నాయకులు
కడప విద్య, న్యూస్‌టుడే : పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి ఉన్నత స్థానాలను చేరుకోవాలని జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ ప్రభాకర్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ భవన్, ఎస్వీ డిగ్రీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక (జవివే) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెకుముకి సంబరాలు నిర్వహించారు. విజేతలకు ప్రొఫెసర్లు వెంకటరామిరెడ్డి, కృష్ణారెడ్డి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా స్థాయి పోటీల్లో తెలుగు మాధ్యమం సుకిత్, ఉమామహేశ్వరి, మనస్విని(నల్లపరెడ్డిపల్లె, పులివెందుల, అంజి, బాషా, రెడ్డిశేఖర్ (రాయచోటి), ఆంగ్లమాధ్యమంలో మదన్‌మోహన్‌రెడ్డి, మనోజ్, కుమారి (మహదేవపురం, చక్రాయపేట మండలం), వేణు, రోహితేశ్వరరెడ్డి, భవిష్య (ప్రొద్దుటూరు) వరుస స్థానాల్లో నిలిచారని జవివే నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జవివే రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్‌రాహుల్, కార్యదర్శి తవ్వాసురేష్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాషా, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.