logo
Published : 29/11/2021 06:39 IST

ఇంజినీరింగ్సీట్లు.. పాట్లు

రెండో విడత అవకాశం

 అవగాహన పెంచుకుంటే మేలు

సత్వర నిర్ణయం లాభదాయకం

ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్‌) పది శాతం కోటా సీట్లు కేటాయించారు. ఆప్షన్లు కేటాయించుకున్న వారు తొలివిడతలో 30 శాతం మంది మాత్రమే చేరతారు. మిగిలినవారు రెండు, మూడు కౌన్సెలింగుల కోసం ఎదురు చూస్తారు. సకాలంలో చేరేలా నిర్ణయం తీసుకోవాలి. మొదటి విడతలో సీటు రానివారు మంచి కళాశాలలో నచ్చిన బ్రాంచి రానివారు రెండో కౌన్సెలింగులో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్ఛు

- మురళి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జేఎన్‌టీయూ, పులివెందుల

చాపాడు, మైదుకూరు న్యూస్‌టుడే: ఇంజినీరింగు కళాశాలల్లో సీట్ల భర్తీకి మొదటి విడత కౌన్సెలింగు పూర్తయింది. కన్వీనర్‌ కోటాలో మిగిలి ఉన్నా సరైన అవగాహన లేకపోవడం వల్ల జిల్లాలో వందల మంది విద్యార్థులు సీటుకు నోచుకోక నైరాశ్యంలో ఉన్నారు. ఏ ర్యాంకునకు ఎక్కడ సీటు వస్తుందో.. ఆస్షన్లు ఎలా పెట్టాలో తెలియక మరికొంత మంది తమకు నచ్చిన బ్రాంచీలు, కళాశాలలకు ఎంపిక కాలేకపోయారు. అలాంటి వారు త్వరలో నిర్వహించే రెండో విడత కౌన్సెలింగులోనైనా అవగాహనతో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం సీటుకు నోచుకోని వారు రెండో విడత కౌన్సెలింగులో నచ్చిన కళాశాలలో కేటగిరీ ర్యాంకుకు ఏ బ్రాంచి వచ్చిందో చూసి అందుకు అనుగుణంగా సీట్లను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ కళాశాలలు, బ్రాంచీలను ఎంపిక చేసుకుంటే మేలు. ఏపీఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో కళాశాలల వారీగా ఎంత ర్యాంకు వరకు సీట్లు వచ్చాయో వివరాలు పొందుపర్చారు. మొదటి విడతలో సీటు వచ్చిన వారు రెండో విడతలో అంతకన్నా ఉత్తమ బ్రాంచీలను నచ్చిన కళాశాలలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. n ఎక్కువ మంది అందుబాటులో ఉన్న మంచి కళాశాలల్లో సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ బ్రాంచీల వైపు మొగ్గు చూపుతూ ఆప్షన్లు పెట్టారు. ఈ మూడు బ్రాంచీలనే అందరూ ఎంపిక చేసుకోవడం వల్ల కొందరికి సీట్లు రాలేదని నిపుణులు చెబుతున్నారు. n మరికొందరు మెకానికల్‌, సివిల్‌, ఈఐ, ఈఈఈ బ్రాంచిల్లో సీట్లు పొందారు. వీటిలో ఆప్షన్లు ఇవ్వకపోవడం వల్ల కొందరికి సీట్లు రాలేదని భావిస్తున్నారు. n జిల్లాలో ఇంజినీరింగు విద్యలో అన్ని కళాశాలల్లో సుమారు పది వేల వరకు సీట్లున్నాయి. రెండు ప్రభుత్వ ఇంజినీరింగు, 15 ప్రైవేటు ఇంజినీరింగు కళాశాలలు బాగా పోటీ పడ్డాయి. మొదటి విడత కౌన్సెలింగులో ప్రైవేటు విభాగంలో 4,078కి 2,786 సీట్లు భర్తీ అయినట్లు ఆన్‌లైన్‌లో చూపుతోంది.n కౌన్సెలింగులో జాప్యం ఐటీ విద్యార్థులకు చాలా సమస్యగా ఉంటుంది. ప్రస్తుతం కళాశాలలు, సీట్లు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది.

- చెన్నారెడ్డి, ప్రొఫెసర్‌, జేఎన్‌టీయ అనంతపురం

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని