logo
Published : 29/11/2021 06:39 IST

జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ పోరాటాలు

మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా సమగ్రాభివృద్ధికి సీపీఎం ఉద్ధృత పోరాటాలు చేపట్టాలని నిర్ణయించిందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నాగభూషణం కల్యాణ మండపంలో సీపీఎం 11వ జిల్లా మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపాలు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై పోరాటం చేయకుండా విభజన హక్కులపై మాట్లాడకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. రాయలసీమ ప్రాంతంలో వరదలతో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ ఏరియల్‌ సర్వే చేసి చేతులు దులుపుకోవటం సమంజసం కాదన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కోరారు. అపరిష్కృత సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువలు సత్వరం పూర్తి చేయాలని కోరారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శిగా జి. చంద్రశేఖర్‌ను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు నారాయణ, మనోహర్‌, శివకుమార్‌, రామ్మోహన్‌, అన్వేష్‌, పాల్గొన్నారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని