logo
Published : 29/11/2021 06:39 IST

విపత్తును సమర్థ్ధంగా ఎదుర్కొంటాం

డీపీవో ప్రభాకర్‌రెడ్డి

‘వరదలు వచ్చినా... ప్రకృతి విపత్తులు సంభవించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల వరద ప్రభావిత గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాం. 835 మంది శానిటేషన్‌ సిబ్బందిని ఉపయోగించుకుని పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాం. తాగునీరు కలుషితం కాకుండా దెబ్బతిన్న పైప్‌లైన్లు మార్చి కొత్తవి వేయించాం. లీకేజీలు అరికట్టాం. అన్ని శాఖల సమన్వయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలను ఆరు రోజుల్లో పరిష్కరించాం’ అని జిల్లా పంచాయతీ అధికారి ధనిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ఆయన వెల్లడించిన వివరాలు ఇలా.. - కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే

ప్ర : వర్షాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగునకు తీసుకుంటున్న చర్యలు?

జ : గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నాం. పీఆర్‌ ఆధ్వర్యంలో 8 మంది విస్తరణాధికారులు, 16 మంది పంచాయతీ కార్యదర్శులు, 64 మంది సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు 835 మంది శానిటేషన్‌ సిబ్బందిని తీసుకొచ్చి పులపత్తారు, ఎగువ, దిగువ మందపల్లె, గుండ్లూరు, రామచంద్రాపురం, సాలీపేట, తొవ్వూరిపేట, పాపరాజుపల్లెలలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాం. 88 జేసీబీలు, 39 డోజర్లను ఉపయోగించాం. మురుగు కాలువలు, వరద ప్రాంతాల్లో ఇళ్లలో పేరుకుపోయిన బురద, మట్టిని తొలగించాం. సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, ఎక్కడా పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.

ప్ర : తాగునీరు కలుషితం కాకుండా, అంటువ్యాధుల ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

జ : వరదలు వచ్చినపుడు తాగునీరు కలుషితం అవుతుంటుంది. ఆ నీటిని తాగితే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూస్తూనే, తాగునీరు కలుషితం కాకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా పలు చర్యలు తీసుకున్నాం. 217 బ్లీచింగ్‌ పౌడర్‌ బస్తాలు, 356 సున్నం బస్తాలను మిశ్రమం చేసి ఆయా ప్రాంతాల్లో చల్లిస్తున్నాం. దోమల నివారణకు నిల్వ నీటిలో ఆయిల్‌ బాల్స్‌, గంబూషియా చేపలను వదిలాం. తాగునీటిని క్లోరినేషన్‌ చేశాం.

ప్ర : సమస్యలు పరిష్కరించడానికి నిధులు కొరత లేదా?

జ : 15వ ఆర్థిక సంఘం కింద రూ.100 కోట్లకు పైగా నిధులు జిల్లా పంచాయతీశాఖకు వస్తాయి. ఇటీవల రూ.23.89 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. జనరల్‌ ఫండ్‌ కింద రూ.1.35 కోట్లు ఉన్నాయి. జిల్లా పంచాయతీకి కేటాయించిన నిధులను ఉపయోగించుకుని పారిశుద్ధ్య సమస్యలు, తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకున్నాం.

ప్రశ్న : భారీ వర్షాల ప్రభావం ఎన్ని గ్రామాల మీద పడింది?

జవాబు : భారీ వర్షాలు, వరదల ప్రభావం ఎక్కువగా రాజంపేట డివిజన్‌పై పడింది. ఆ డివిజన్‌లో 8 గ్రామాలు వరదలకు ఎక్కువగా దెబ్బతిన్నాయి. రాయచోటి, రైల్వేకోడూరు, కడప డివిజన్‌లో కొన్ని గ్రామాలపై ప్రభావం ఉన్నా నష్టం ఎక్కువగా లేదు.

ప్ర : భారీ వర్షాలు వస్తాయని అంటున్న నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

జ : ప్రకృతి విపత్తులు ఎప్పుడు సంభవించిన ఎదుర్కొనేందుకు తమ శాఖ సిద్ధంగా ఉంది. మళ్లీ భారీ వచ్చినా సురక్షిత నీటిని అందించడానికి, పారిశుద్ధ్యం లోపించకుండా, అంటువ్యాధుల ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిబ్బందికి ఇప్పటికే సూచనలు చేశాం. ముందస్తుగా ఆయిల్‌బాల్స్‌, బ్లీచింగ్‌పౌడర్‌, సున్నం బ్యాగ్‌లను సిద్ధం చేసి నిల్వ ఉంచుకున్నాం. భారీ వర్షాలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని