logo
Published : 29/11/2021 06:39 IST

దర్జాగా కబ్జా!

ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతం

 రాయచోటిలో ఆక్రమణల పర్వం


విద్యుత్తు నియంత్రికలు, కాలువలు, కంచెలున్న ఈ స్థలం పట్టణంలోని కంసాలవీధిలోనిది. ఇక్కడి ప్రభుత్వ

చేదబావి కనుమరుగైంది. ప్రస్తుతం ఈ స్థలం ఆక్రమణలకు గురై పరాధీనంలో ఉన్నా అధికారులు గుర్తించడంలేదు.

- న్యూస్‌టుడే రాయచోటి రాయచోటి పట్టణ పరిధిలోని రింగ్‌రోడ్డు, గున్నికుంట్ల రోడ్డు, మాసాపేట, గాలివీడు రోడ్డు, కె.రామాపురం రోడ్డు తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, వాగులపై ఆక్రమణదారుల కన్ను పడింది. పట్టణ పరిధిలో విశాలమైన ప్రభుత్వ స్థలాలున్నా చాలా వరకు డీకేటీ పట్టాలుగా మారిపోయాయి. పంచాయతీగా ఉన్నప్పటి నుంచి పట్టణ నడిబొడ్డున కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాలు, చేద బావులు, చావిడి, వీధిరస్తాలు తదితర వాటిని స్వాధీనం చేసుకోవడంపై అధికారులు దృష్టిసారించలేదు. దీంతో స్థలాలకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు వ్యక్తులు వాటిని ఆక్రమించుకుని వ్యాపార సముదాయాలు నిర్మించుకున్నారు.

గున్నికుంట్ల రోడ్డులోని కుంట స్థలాన్ని ప్లాట్లుగా మార్చేశారు. దీనిపై గతంలో పత్రికల్లో కథనాలు వెలువడడంతో అధికారులు గుర్తించి ఆక్రమణలు అడ్డుకున్నా ఇంతవరకు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. l కె.రామాపురం రోడ్డుపైనున్న కుంట స్థలం ఆక్రమణలకు గురైంది. ఓ థియేటర్‌ ఎదురుగా 60 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇటీవల నిర్మాణాలు జోరందుకోగా, ఇదే థియేటర్‌ వెనుక భాగంలోని చేదబావి ఆక్రమణలతో కనుమరుగైంది. l కంసాలవీధి ప్రధాన రహదారిలోని బావి, పరిసరాలు చాలావరకు అన్యాక్రాంతమయ్యాయి. మదనపల్లి రోడ్డులో ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురికాకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. బండ్లపెంట వద్ద ఉన్న పాత చావిడి స్థలం చాలా వరకు కబ్జాకు గురైంది. మిగిలిన స్థలంలో ప్రభుత్వ కార్యాలయం నిర్మాణంలో ఉంది.

ప్రభుత్వ స్థలాలు పరిరక్షిస్తాం - రాంబాబు, కమిషనర్‌, రాయచోటి

ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై పాలకమండలిలో చర్చ జరిగింది. కొన్ని స్థలాలకు దస్త్రాల్లేకపోవడంతో స్వాధీనం చేసుకోలేకపోయాం. రెవెన్యూ, నీటిపారుదలశాఖల అధికారులను సమన్వయం చేసుకుని చెరువులు, కుంటలను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

ఇది పాత బస్టాండు సమీపంలోని ప్రభుత్వాసుపత్రి ప్రహరీ పక్కనున్న పురపాలక స్థలం. ఆక్రమణదారులు తాత్కాలికషెడ్లు నిర్మించి అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ప్రజా మరుగుదొడ్ల వినియోగానికి అవకాశం లేకుండా దుకాణాలు చొచ్చుకొచ్చేశాయి.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని