logo
Published : 02/12/2021 02:41 IST

ప్రవేశాలకు నిరీక్షణ

ట్రిపుల్‌ఐటీలలో ప్రత్యేక కేటగిరి సీట్ల భర్తీకి ఎదురుచూపులు 

- న్యూస్‌టుడే, వేంపల్లె 

ప్రవేశాలకు తరలివచ్చిన వివిధ జిల్లాల విద్యార్థులు, తల్లిదండ్రులు

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో ప్రత్యేక కేటగిరి కింద ఉన్న 257 సీట్ల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆయా ట్రిపుల్‌ఐటీలలో సాధారణ, ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో ప్రత్యేక కేటగిరి కింద 257 సీట్లు ఉన్నాయి. వీటిలో క్రీడా  కోటా కింద 20 సీట్లు, సైనికోద్యోగుల కోటాలో 80 సీట్లు, ఎన్‌సీసీ 40 సీట్లు, దివ్యాంగుల కోటా కింద 120 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు ట్రిపుల్‌ఐటీలలో సాధారణ కోటా కింద ఉన్న 4,143 సీట్ల భర్తీకి గత నెల 23వ తేదీ నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకు ఇడుపులపాయ, నూజివీడు కేంద్రాలుగా విద్యార్థులను ఆహ్వానించి అంతర్జాలం ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరోవైపు ప్రత్యేక కేటగిరి సీట్ల భర్తీకి అధికారులు రాష్ట్ర నలుమూలల నుంచి దివ్యాంగులతోపాటు మిగిలిన మూడు విభాగాలకు చెందిన విద్యార్థులను గత నెల 10 నుంచి 12వ తేదీ వరకు నూజివీడుకు పిలిపించి విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. ఒక్కో సీటుకు ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను పిలిపించి ధ్రువపత్రాలు పరిశీలించారు. ఇందులో ఇప్పటివరకు ప్రతిభ జాబితాలు ప్రకటించకపోవడంతో సీట్లపై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ కోటా సీట్లను భర్తీ చేసిన అధికారులు తమ కోటా సీట్లను ఎప్పుడు భర్తీ చేస్తారోనని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై వర్శిటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల శాఖ, ఎన్‌సీసీ, క్రీడల శాఖ, సైనికశాఖ ఉన్నతాధికారుల నుంచి విద్యార్థుల ప్రతిభ జాబితాలు రావడం ఆలస్యం కావడంతోనే సీట్ల భర్తీలో జాప్యం జరుగుతోందన్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి విద్యార్థుల ప్రతిభ జాబితాలు అందిన వెంటనే సదరు ప్రత్యేక కేటగిరి సీట్లను భర్తీ చేస్తామని ఆయన వివరించారు. 

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని