logo
Published : 02/12/2021 02:41 IST

పొలాలు...ఎడారులు!

వరద ప్రవాహంతో వెలసిన ఇసుక మేటలు

రైతుకు కన్నీరు మిగిల్చిన చెయ్యేరు

రాజంపేట మండలం ఎకిరిపల్లి భూముల్లో వేసిన ఇసుక మేటలు

ఒంటిమిట్ట, రాజంపేట గ్రామీణ, పెనగలూరు, న్యూస్‌టుడే: పసిడి భూములు. నేలలో సారం మెండు. బంగరు పంటలు పండే సున్నితమైన పొలాలు. గలగల ప్రవహించే చేయ్యేరు నది ఇన్నాళ్లు సాగునీటి భరోసానిచ్చింది. ఏటా రెండు, మూడుకారుల పైర్లు సాగు చేసుకుంటూ హాయిగా జీవనం సాగించే కర్షకులను వరదొచ్చి కకావికలం చేసింది. నిన్నటిదాకా పచ్చదనంతో కనిపించిన పొలాలు..నేడు ఇసుక మేటలు, రాళ్లు దిబ్బలతో నిండి నిర్జీవంగా మారడంతో రైతులు కంటతడి పెడుతున్నారు.

ఈ గ్రామాల్లో అపార నష్టం

అన్నమయ్య కట్ట తెగిపోవడంతో చేయ్యేరు నది నీటి పరవళ్లకు నది పరివాహకంలో ఉన్న ఎకిరిపల్లి, బగ్గిడిపల్లి, చింతలకోన, నూతిపల్లి, పులపుత్తూరు, ఎగువ, దిగువ మందపల్లి, పాపరాజుపల్లె, అడవిరాచపల్లె, గుండ్లూరు, చొప్పవారిపల్లె, శేషమాంబపురం గ్రామాల్లో గతంలో నిర్మించిన జగతి కట్టలు ధ్వంసం అయ్యాయి. అవతలి ఒడ్డున తోగురుపేట, సాలిపేట, రామచంద్రాపురం, నందలూరు మండలం పాటూరు, ఇసుకపల్లి, నీలిపల్లి, నాగిరెడ్డిపల్లె, నందలూరు, పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు, ఓబిలి, ఎగువ, దిగువ సిద్ధవరం, పద్మయ్యగారిపల్లె, కోడిచెన్నయ్యగారిపల్లె, పెనగలూరు, నరసింగరాజుపురం, పల్లంపాడులో చేయ్యేరు వరద చేరింది. ఈ మూడు మండలాల్లో ఇసుక మేటలు 406.8 హెక్టార్లు, భూమి కోత 216.6 హెక్టార్లలో జరిగినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు.

పెట్టుబడి రాయితీ పెంచాలి

ఒక హెక్టారుకు బాగు చేసేందుకు ప్రభుత్వం రూ.12,200ల పెట్టుబడి రాయితీ ఇస్తోంది. ఇది ఏమాత్రం సరిపోదని కనీసం రూ.40 వేలకు పైగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వమే ఇసుక మేటలను తొలగించి భూమిని పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోతుగా భూమి కోతకు గురైంది. గుంతలు పూడ్చడానికి హెక్టారుకు రూ.37,500 ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మొత్తాన్ని రూ.70 వేలకు పెంచాలని రైతులు అడుగుతున్నారు.

సమగ్రంగా సమాచారం సేకరణ

రాజంపేట డివిజన్‌లో భారీ వర్షాలు, వరదలతో 406 హెక్టార్లల్లో ఇసుక మేటలు వేశాయి. మరో 216.8 హెక్టార్లలో భూములు కోతకు గురయ్యాయి. క్షేత్రస్థాయిలో సమగ్రంగా సమాచారాన్ని సేకరించాం. పెట్టుబడి రాయితీ మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఆర్థిక అనుమతి రాగానే బాధితుల ఖాతాల్లో జమ చేస్తాం. - డి.ఉమ, ఏడీ, వ్యవసాయశాఖ, రాజంపేట

అడవి రాచపల్లె దిగువన పంట పొలాల్లోకి చేరిన రాళ్లు

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని