logo
Published : 02/12/2021 02:41 IST

భారీగా ఎర్రచందనం దుంగల స్వాధీనం

రైల్వేకోడూరు : వివరాలు వెల్లడిస్తున్న పోలీసు అధికారులు

రాయచోటి, సుండుపల్లి, న్యూస్‌టుడే: సుండుపల్లి మండలంలోని శేషాచల అడవుల సమీపంలో నగిరి వద్ద మామిడి తోటల్లో దాచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి డీఎస్పీ పి.శ్రీధర్‌ తెలిపారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు రాళ్లతో ఎదురు దాడికి దిగారన్నారు. పోలీసులు చాకచక్యంగా దాడిని ఎదుర్కొని నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారన్నారు. రవాణాకు సిద్ధంగా ఉంచిన రూ.18 లక్షల విలువైన 20 ఎర్రచందనం దుంగలు, మినీ లారీ, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో తమిళనాడు రాష్ట్రం రాణిపేట్‌ జిల్లా అరక్కొణం మురంగై గ్రామానికి చెందిన పన్నీరు సెల్వం(24), సుండుపల్లి మండలం ముడుంపాడుకు చెందిన చిన్నరెడ్డెప్పనాయుడు(35), గురిగింజకుంట రెడ్డెప్పనాయుడు(42), అనంతపురం జిల్లా ఎన్‌.పి.కుంట మండలం నల్లగుట్టపల్లెకు చెందిన మల్లికార్జుననాయుడు(44) ఉన్నారన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.

రైల్వేకోడూరు : కుక్కలదొడ్డి సమీప అడవుల్లో కారుతో సహా 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను పట్టుకున్నట్లు సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్సై పెద్దఓబన్న తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం వారు విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ముందుగా అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు చేసి ఎర్రచందనం దుంగలను కారులో తరలించడానికి సిద్ధం చేస్తున్న ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు మండలాలకు చెందిన దక్షిరాజు శివ, కనకమల్లి ముని, వీసం రాజారెడ్డి, నన్నూరి వెంకటరమణను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని