logo
Published : 02/12/2021 02:41 IST

వివాహిత దారుణ హత్య

కుమార్తెతో పగిడిపాలెం రిజ్వాన (పాతచిత్రం)

పులివెందుల గ్రామీణ న్యూస్‌టుడే: ఓ వివాహితను తన ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కడప జిల్లా పులివెందులలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు..అనంతపురం జిల్లా నూతన కాలువకు చెందిన పగిడిపాలెం రిజ్వాన (23)కు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన సర్దార్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నాయి. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కొన్ని నెలల క్రితం రిజ్వాన తన ప్రియుడు హర్షవర్ధన్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లింది. అనంతరం కుటుంబ సభ్యులు వెతుకుతూ బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకుని పది రోజుల క్రితం ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసి సర్దిచెప్పడంతో ఆమె తన భర్తతో కలిసి పులివెందులలో ఉంటున్నారు. అప్పటి నుంచి ఆమెకు, హర్షవర్ధన్‌కు మాటల్లేవు. దీంతో ఆగ్రహించిన అతడు, బుధవారం ఓ దుకాణంలో రిజ్వాన, ఆమె భర్త ఉండగా లోపలికి వెళ్లిన హర్షవర్ధన్‌ కత్తితో ఆమెను పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనలో కుమార్తె మెగిషిన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి భర్త సర్దార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని