logo
Published : 02/12/2021 02:41 IST

రూ. 9 లక్షల విలువైన గుట్కా బస్తాలు స్వాధీనం

గుట్కా బస్తాలు, నిందితులతో పోలీసులు

కడప నేరవార్తలు, చెన్నూరు, న్యూస్‌టుడే: కడప అర్బన్‌ పోలీసులు నిర్వహించిన దాడుల్లో ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.9 లక్షలు విలువ గల గుట్కా బస్తాలను స్వాధీనపరచుకున్నారు. అరెస్టైన వారిని బుధవారం డీఎస్పీ వెంకటశివారెడ్డి తన కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. హైదరాబాద్‌ నుంచి నిషేధిత గుట్కా బస్తాలతో ఓ లారీ కడప వైపు వస్తున్నట్లు సమాచారం రావడంతో అర్బన్‌ సీఐ అలీ, చెన్నూరు ఎస్సై తమ సిబ్బందితో చెన్నూరు మండలం ఉప్పరపల్లె క్రాస్‌ రోడ్డు సమీపంలో నిఘా ఉంచారు. లారీ క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే డ్రైవర్‌ పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు. ఈ దాడుల్లో వినాయకనగర్‌కు చెందిన విష్ణుక్రాంత్‌, సాయిక్రాంత్‌, రవీంద్రనగర్‌కు చెందిన చెరుకూరి సురేష్‌ను అరెస్టు చేశారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని