logo
Published : 02/12/2021 02:41 IST

ఆక్రమించుకున్నారంటూ ఆందోళన

చదును చేసిన పొలంలో నిరసన తెలుపుతున్న దళితులు

అట్లూరు, న్యూస్‌టుడే: అట్లూరు మండలం మణ్యంవారిపల్లె సమీపంలోని సుమారు 200 ఎకరాల్లోని ప్రభుత్వ భూమిని కొంతమంది నాయకులు గత నాలుగు రోజులుగా చదును చేస్తుండడంపై బుధవారం స్థానిక దళితులు ఆందోళనకు దిగారు. కమలకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే సంఖ్య 6లో 564.28 ఎకరాల పొలముందని, ఇందులో వ్యవసాయానికి అనువైన సుమారు 200 ఎకరాల కుంట పోరంబోకును చదును చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూములను మణ్యంవారిపల్లె పంచాయతీ దిన్నెమీదపల్లెకు చెందిన దళితులకు ఇస్తామని గతంలో నాయకులు హామీ ఇచ్చి ఇప్పుడేమో దున్నేస్తున్నారని ఆరోపించారు. తమకు పట్టాలిచ్చే వరకు వదిలేదిలేదన్నారు. దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దారు ఇందిరరాణి సంఘటనా స్థలానికి చేరుకుని ఆక్రమిత ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళనను విరమించారు. భూములను చదును చేసినవారి వివరాలు వెల్లడి కాలేదని తెలిపారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని