logo
Published : 02/12/2021 02:41 IST

జాతీయ విపత్తుగా ప్రకటించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

కూలిపోయిన వంతెనను పరిశీలిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నాయకులు

కమలాపురం, మైదుకూరు, న్యూస్‌టుడే: కడప, నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లోని వరద బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. కమలాపురం-తాడిపత్రి రహదారిలోని పాపఘ్ని నదిపై ఇటీవల కూలిపోయిన వంతెనను బుధవారం ఆయన పరిశీలించారు. మైదుకూరులో విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నంలో గ్యాస్‌ లీకేజీతో మృతిచెందినవారికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి పరిహారమిచ్చి ఆయన సొంత జిల్లాలో వరదలకు మృతిచెందినవారికి రూ.5 లక్షలు ప్రకటించడం దారుణమన్నారు. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ విజయవాడలో 5వ తేదీ అన్ని రాజకీయ పార్టీలు, రైతు, ప్రజాసంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని బాధిత రైతులు నెల్లూరు జిల్లాలో మహాపాద యాత్ర చేస్తుంటే వారికి భోజనాలు తినేందుకు అవకాశమివ్వ కుండా ఓ ప్రజాప్రతినిధి వ్యవహరించడం బాధాకరమన్నారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఆయనవెంట ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ప్రాంతీయ కార్యదర్శి చంద్ర శేఖర్‌, జిల్లా కార్యవర్గసభ్యులు తదితరులున్నారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని