logo
Published : 02/12/2021 02:41 IST

డబ్బులు కట్టాల్సిందేనని ఒత్తిడి చేయొద్దు

సంపూర్ణ గృహ హక్కు పథకంపై చీఫ్‌ విప్‌ సమీక్ష

అధికారులతో సమీక్షిస్తున్న చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి, న్యూస్‌టుడే: ఏకకాల పరిష్కార సంపూర్ణ గృహహక్కు పథకంపై లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయచోటిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన పురపాలక, గృహనిర్మాణ శాఖల అధికారులతో సమీక్షించారు. ఇళ్లపై సర్వహక్కులు ప్రభుత్వం ద్వారా రిజిస్టర్‌ చేసి దస్తావేజు పొందే అవకాశమే ఈ పథక లక్ష్యమని, కొంత మంది లబ్ధిదారులను అయోమయానికి గురిచేస్తున్నారని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఇళ్ల నిర్మాణ సమయంలో గృహ నిర్మాణశాఖ లబ్ధిదారులకు రుణం ఇస్తుందని వివరించారు. తనఖా పెట్టుకోడానికి వీలుగా ఆ స్థలాన్ని 22(ఎ) నిషేదిత జాబితా నుంచి తొలగిస్తామన్నారు. డబ్బులు చెల్లించాలని లబ్ధిదారులను ఒత్తిడి చేయొద్దని కమిషనర్‌ రాంబాబు, అధికారులను ఆదేశించారు. రుణ మాఫీ వద్దనుకున్నవారు డబ్బులు చెల్లించకపోయినా నష్టం జరగదని ప్రభుత్వం తరఫున మాట ఇస్తున్నామన్నారు. డబ్బులు కట్టాలని అధికారులు ఎవరైనా ఒత్తిడి చేస్తే లబ్ధిదారులు నేరుగా తనను సంప్రదించాలని ఆయన సూచించారు. సమీక్షలో పురపాలక సంఘం ఛైర్మన్‌ ఎస్‌.ఫయాజ్‌బాషా, డీఈ సుధాకర్‌నాయక్‌, ఏఈ కృష్ణారెడ్డి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని