logo
Published : 02/12/2021 02:41 IST

కడప నగరానికిఏం కావాలంటే...

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు

గురైన కడప నగరంలోని నాగరాజుపేట (దాచిన చిత్రం)

కడప నగరంలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడకుండా బుగ్గవంకకు రక్షణగోడ నిర్మాణం పూర్తి చేయడంతోపాటు వంకలపై ఆక్రమణలు తొలగించి వరదనీటి ప్రవాహ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ● తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కనీసం ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసుకోగల మంచినీటి రిజర్వాయరు నిర్మాణంతోపాటు నీటి కేటాయింపులు జరపాలి. ● నగరంలోని అంబేడ్కర్‌ కూడలి-వై.కూడలి, పొట్టి శ్రీరాములు కూడలి-కృష్ణా చిత్రమందిరం కూడలి, కృష్ణా చిత్రమందిరం కూడలి- దేవుని కడప మీదుగా ఔటర్‌ రింగు రోడ్డు విస్తరణ పనుల్లో ఏ మాత్రం పురోగతి లేదు. 2021, జులై 9న మంజూరైన పనులు నేటికీ ప్రారంభం కాలేదు. 2007-10 మధ్య ప్రారంభించి అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి విస్తరణ పనులకు ఇంతవరకు మోక్షం కలగలేదు. వీటిపై దృష్టి సారించాలి. ● రూ.72 కోట్లతో చేపట్టిన భూగర్భమురుగునీటి పారుదల వ్యవస్థను వినియోగంలోకి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో నాలుగైదు డివిజన్ల ప్రజలు నిత్యం మురుగునీటి మధ్య జీవనం సాగించాల్సి వస్తోంది. అమృత్‌ పథకం కింద భూగర్భమురుగునీటిపారుదల పనులకు పిలిచిన టెండర్ల ప్రక్రియ అతీగతీ లేదు. కడప యూజీడీ పనులు పూర్తిచేయడానికి రూ.126 కోట్లు అవసరమన్న అధికారుల ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ● 164 చకిమీ విస్తీర్ణం గల నగరంలో ప్రభుత్వ సర్వజనవైద్యశాల, కేంద్రీయ విద్యాలయం, క్రీడా పాఠశాల, నగరవనం, ఇందిరమ్మ కాలనీ, హజ్‌భవన్‌, విమానాశ్రయం, పారిశ్రామిక వాడ, ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీ తదితర సంస్థలు నగరానికి వెలుపల ఉన్నాయి. ఈ ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. పదేళ్ల కిందట కేటాయించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం సిటీ బస్సులు ఏమయ్యాయో తెలియడంలేదు. ఆర్టీసీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంది.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని