logo

ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు

అర్హులైన నిరుపేదలకు ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని జేఎన్‌టీయూ కళాశాల వెనుక జగనన్న లేఅవుట్‌ను శనివారం ఆయన కలెక్టర్‌ విజయరామరాజు,

Published : 05 Dec 2021 03:02 IST


కలెక్టర్‌ విజయరామరాజు, అధికారులతో చర్చిస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి

పులివెందుల, న్యూస్‌టుడే: అర్హులైన నిరుపేదలకు ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని జేఎన్‌టీయూ కళాశాల వెనుక జగనన్న లేఅవుట్‌ను శనివారం ఆయన కలెక్టర్‌ విజయరామరాజు, అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం మంజూరు చేసే బిల్లులతోనే ఆకర్షణీయంగా ఇళ్లు నిర్మించేందుకు ఓ సంస్థ గుత్తేదారుడు ముందుకొచ్చారన్నారు. విడతల వారీగా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు మౌలిక వసతుల కల్పన భూగర్భమురుగునీటిపారుదల వ్యవస్థ పనులు చేపడతామన్నారు. కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ లబ్ధిదారులకు స్థలాలు కేటాయించి పట్టాలు తయారు చేయడంతోపాటు ఆయా స్థలాలను చదును చేసి హద్దు రాళ్లు నాటాలని రెవెన్యూ, గృహనిర్మాణశాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ధ్యాన్‌చంద్ర, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, పురపాలక సంఘం ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లు వరప్రసాద్‌, మనోహరరెడ్డి, హఫీీజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని