logo

రూ.500 కోట్లతో వరద నీటి ప్రవాహ వ్యవస్థ

కడప నగరంలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మేయరు సురేష్‌బాబు తెలిపారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. ముంపు సమస్యకు గల కారణాలతోపాటు

Published : 05 Dec 2021 03:02 IST


వరదనీటి ప్రవాహ పటాలను పరిశీలిస్తున్న ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మేయరు సురేష్‌బాబు, అధికారులు

కడప నగరపాలక, న్యూస్‌టుడే: కడప నగరంలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మేయరు సురేష్‌బాబు తెలిపారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. ముంపు సమస్యకు గల కారణాలతోపాటు ఆక్రమణలు గుర్తించేందుకు సమగ్ర సర్వే చేయిస్తామన్నారు. నగరం మొత్తం యూనిట్‌గా తీసుకుని వరదనీటి ప్రవాహ వ్యవస్థ ఏర్పాటుకు బృహత్తర ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకు సుమారు రూ.500 కోట్ల నిధులు అవసరమవుతాయని వివరించారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ రూపొందించిన అనంతరం సమగ్ర వివరాలతో కూడిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. పనులకు ఆమోదముద్ర లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సమీక్ష సమావేశంలో ఉపమేయరు బండి నిత్యానందరెడ్డి, కమిషనర్‌ రంగస్వామి, డీఎస్పీ వెంకటసుబ్డారెడ్డి, తహసీల్దారు శివరామిరెడ్డి, ప్రణాళిక విభాగం ఆర్డీ శైలజ, ప్రణాళికాధికారి నాగేంద్ర, ఈఈ ధనలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని