logo

స్ఫూర్తి ప్రదాత రోశయ్య

మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనతో అనుబంధం ఉన్న జిల్లా వాసుల గుండెలు బరువెక్కాయి.ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు.

Published : 05 Dec 2021 03:02 IST

ప్రొద్దుటూరుతో అనుబంధం మరువరానిది


శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీదేవి సన్నిధిలో రోశయ్య (దాచిన చిత్రం)

ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు గ్రామీణ, ప్రొద్దుటూరు పట్టణం, కడప విద్య, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనతో అనుబంధం ఉన్న జిల్లా వాసుల గుండెలు బరువెక్కాయి.ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. 
* రాష్ట్ర ఆర్థిక, వ్యవహారాలశాఖ మంత్రి హోదాలో 2005లో ప్రొద్దుటూరులో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు రోశయ్య.. ఆర్యవైశ్య మహాసభ 125వ వార్షికోత్సవానికి వచ్చి శ్రీకన్యకా పరమేశ్వరీదేవికి వజ్ర కిరీటధారణ చేశారు. పెన్నాతీరంలో ఉన్న శ్రీఅయ్యప్ప స్వామి, అమృతేశ్వర స్వామి, వైఎంఆర్‌ కాలనీలోని సాయిబాబా ఆలయాలను ఆయన సందర్శించారు. ఆర్యవైశ్య సభ దివ్య శతాధిక రజతోత్సవాల్లో పాల్గొన్నారు. సావనీరు పుస్తకాన్ని ఆవిష్కరించారు. 
* గొప్ప వ్యక్తిని కోల్పోయామని తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు చిప్పగిరి వెంకట ప్రసాద్‌ కుమార్‌ శెట్టి కొనియాడారు. ఆయనతో తనకు 25 ఏళ్ల పాటు అనుబంధం ఉందని, నా రాజకీయ గురువు, మార్గదర్శి అని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
* మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతికి ప్రొద్దుటూరు ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్‌రావు, సభ కార్యవర్గ సభ్యులు సంతాపం ప్రకటించారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని వాసవీ మాతను ప్రార్థిస్తున్నట్లు   చెప్పారు.
* మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి తీరనిలోటని ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా, రాష్ట్ర గవర్నర్‌గా విశేష సేవలు అందించారని కొనియాడారు.
* రాజకీయాల్లో అజాత శత్రువుగా విమర్శకులను సైతం మెప్పించిన మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నరు రోశయ్య మృతి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి తెలిపారు. 1989 నుంచి ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు పాతతరం రాజకీయాల్లో విశేష అనుభవంతో వివాదాస్పదం లేనివిధంగా రోశయ్య అందరి మన్ననలు పొందారన్నారు. 


ప్రొద్దుటూరు : గాంధీజీ విగ్రహం ఆవిష్కరణ శిలాఫలకం వద్ద నాటి ఆర్థిక మంత్రి రోశయ్య, జిల్లా నాయకులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు