logo

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందారు. కడప నగరంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీ ఎంఐజీహెచ్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌రెడ్డి (30) రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి మణికొండ పంచవటి కాలనీలో నివసిస్తున్నారు. ఓ సంస్థలో ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

Published : 05 Dec 2021 03:02 IST

మనోజ్‌ కుమార్‌ రెడ్డి (దాచిన చిత్రం)

రాయదుర్గం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందారు. కడప నగరంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీ ఎంఐజీహెచ్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌రెడ్డి (30) రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి మణికొండ పంచవటి కాలనీలో నివసిస్తున్నారు. ఓ సంస్థలో ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఏడాది క్రితం వివాహం అయింది. భార్య కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. వీరికి ఇంకా సంతానం కలగలేదు. శుక్రవారం తన భార్యకు మాదాపూర్‌లోని మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళ్తున్నట్లు చెప్పి బైకుపై వెళ్లాడు. రాత్రి 7.30 గంటల సమయంలో మల్కంచెరువు పక్కన కొత్తగా నిర్మించిన రోడ్డు మీదుగా తన ఇంటికి వస్తుండగా..అక్కడి గంగోత్రి పాఠశాల వద్ద రోడ్డుపై నిలిపిన ఆటో ట్రాలీని వెనుక నుంచి ఢీకొట్టి కిందపడిపోయాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజాము మృతి చెందాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని పబ్బాపురం క్రాస్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారని ఎస్‌.ఐ.మంజునాథరెడ్డి తెలిపారు. కొప్పర్తి గ్రామానికి చెందిన చెమ్మిరెడ్డి రామసుబ్బారెడ్డి (55) శనివారô ఎద్దుల బండిపై ఇసుకను కడప నగరానికి తీసుకెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామసుబ్బారెడ్డిని 108లో రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ.తెలిపారు.


రామసుబ్బారెడ్డి (దాచిన చిత్రం) 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని