logo
Published : 05 Dec 2021 03:02 IST

పంట నష్టాలు అంచనా వేయండి : ఎంపీ

పులివెందుల, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఆయన వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి తయారు చేసిన పంటల నష్టం నివేదికను సమర్పిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం అందేవిధంగా చూస్తామన్నారు. శనగ విత్తనాలు 80 శాతం రాయితీపై రైతులకు పంపిణీ చేయాలన్నారు. వ్యవసాయ శాఖ  జేడీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. సుమారు 35,538 హెక్టార్లల్లో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. సమీక్షలో ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ ఏడీలు పుష్పలత, అనిత పాల్గొన్నారు. 

రేపు స్పందన కార్యక్రమం : కలెక్టర్‌
జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే:  ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ విజయరామరాజు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమాన్ని కలెక్టర్‌ కార్యాలయంతోపాటు గ్రామ, మండల స్థాయిలో కూడా నిర్వహిస్తామని, మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. 

ప్రాణనష్టం నివారించాలి: ఎస్పీ
కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా మంది మృతి చెందారని ఇకపై ఒక్క ప్రాణం కూడా పోయేందుకు వీల్లేదని ఎస్పీ అన్బురాజన్‌ ఆదేశించారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా శనివారం పోలీసులు అవగాహన కల్పించారు. భారీ వర్షాలకు జిల్లాలో వంకలు, నదులు, చెరువులు, వాగులు పూర్తిస్థాయిలో నిండి ప్రమాద స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. వాటి వద్దకు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. వారాంతపు సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లకుండా చూడాలన్నారు. 

ఓటీఎస్‌ పేరుతో  వైకాపా వసూళ్లు : తెదేపా
ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రి పేదల ఇళ్లను ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలనే ఆలోచన చేయలేదని, సీఎం జగన్‌ ఓటీఎస్‌ పేరుతో రూ.4,800 కోట్లు వసూలు చేసేందుకు ప్రణాళిక వేశారని తెదేపా కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి ప్రకటనలో ఆరోపించారు. ఎవరో కట్టిన ఇళ్లకు తన పేరు పెట్టుకోవాలనే విచిత్రమైన ఆలోచనకు కార్యరూపమిచ్చారన్నారు. 1983 నుంచి 2017 నుంచి వివిధ గృహ నిర్మాణ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 56,69,891 మంది లోన్‌ కాంపొనెంట్‌ కింద లబ్ధి పొందారని, వీరందరికీ ఈ ఓటీఎస్‌ పథకం వర్తిస్తుందని వైకాపా ప్రభుత్వం ఓ జీవోలో పేర్కొందని తెలిపారు. వెంటనే ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. 

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని