logo

బాధిత రైతులను ఆదుకోవాలి : పుత్తా

వరదలతో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహరెడ్డి డిమాండు చేశారు. పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె మండలాల పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను శనివారం ఆయా గ్రామాల రైతులతో కలిసి పరిశీలించారు.

Published : 05 Dec 2021 03:02 IST


 గోనుమాకులపల్లెలో దెబ్బతిన్న మినుము పంటను పరిశీలిస్తున్న 
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె, న్యూస్‌టుడే: వరదలతో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహరెడ్డి డిమాండు చేశారు. పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె మండలాల పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను శనివారం ఆయా గ్రామాల రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొండూరు వాసులు తమ పంటలు నష్టపోయామని వ్యవసాయాధికారులకు చెప్పినా పంట నష్టం వివరాల నమోదులో తమ పేర్లు చేర్చడం లేదని పుత్తా దృష్టికి తెచ్చారు. దీంతో కడప డివిజన్‌ వ్యవసాయ శాఖ ఏడీ నరసింహారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని కోరారు. అనంతరం వీరపునాయునిపల్లె మండలం గోనుమాకులపల్లె, కదిరేపల్లె, రాజుపాలెం, తాటిమాకులపల్లె గ్రామ సమీపంలోని పంట పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీ గంగిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, అన్నమయ్య, మాజీ ఎంపీపీ ప్రసాదరెడ్డి, భాస్కరరెడ్డి పాల్గొన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని