logo

రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

కాశినాయన మండలంలోని కోడిగుడ్లపాడు, కొండ్రాజుపల్లి గ్రామాల్లోని ముగ్గురు రైతులు అప్పులు బాధ భరించలేక గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం రైతు ఆత్మహత్య కింద ఒక్కొక్కరికి రూ. ఏడు లక్షల చొప్పున ముగ్గురికి కలిపి రూ. 21 లక్షలను ప్రభుత్వం వారి కుటుంబాల బ్యాంకు

Published : 05 Dec 2021 03:02 IST


ఆర్థిక సాయం అందిస్తున్న కన్వీనర్‌ విశ్వనాథరెడ్డి 

బి.కోడూరు (కాశినాయన) న్యూస్‌టుడే: కాశినాయన మండలంలోని కోడిగుడ్లపాడు, కొండ్రాజుపల్లి గ్రామాల్లోని ముగ్గురు రైతులు అప్పులు బాధ భరించలేక గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం రైతు ఆత్మహత్య కింద ఒక్కొక్కరికి రూ. ఏడు లక్షల చొప్పున ముగ్గురికి కలిపి రూ. 21 లక్షలను ప్రభుత్వం వారి కుటుంబాల బ్యాంకు అకౌంట్లలో జమ చేసిందని వైకాపా మండల కన్వీనర్‌ నల్లేరు విశ్వనాథరెడ్డి తెలిపారు. మృతిచెందిన కోడిగుడ్లపాడు కొనకొండు మాధవ, కొండ్రాజుపల్లె కత్తెరగాండ్ల శ్రీరాములు, కత్తెరగాండ్ల చెన్నయ్య కుటుంబ సభ్యుల అకౌంట్లలో నగదు జమైందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సత్యనారాయణరెడ్డి, సర్పంచ్లు  గురుబ్రహ్మం, బాలగుర్రయ్య, వైకాపా నాయకుల పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని