లోక్‌అదాలత్‌తో కేసుల పరిష్కారం
మాట్లాడుతున్న జిల్లా 5వ అదనపు కోర్టు న్యాయమూర్తి డి.లక్ష్మీ
రాయచోటి, న్యూస్‌టుడే : జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా 5వ అదనపు కోర్టు న్యాయమూర్తి డి.లక్ష్మీ పేర్కొన్నారు. రాయచోటి కోర్టుల పరిధిలోని మండలాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను కక్షిదారులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొనేందుకు ముందుకు రావాలన్నారు. కక్షిదారుల సౌకర్యార్థం అత్యున్నత న్యాయ స్థానం చేపట్టిన మెగా లోక్‌అదాలత్ విజయవంతానికి పోలీసులు, రెవెన్యూ అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శైలజ, ఫాతిమా, హారిక, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
లక్కిరెడ్డిపల్లె : ఈ నెల 11న లక్కిరెడ్డిపల్లె న్యాయస్థానంలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి ఫాతీమా పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎంఎల్ రామచంద్రారెడ్డి, చెన్నకృష్ణయ్య, బాలారెడ్డి, రెడ్డెన్న సిబ్బంది పాల్గొన్నారు.