12 నుంచి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పరుగులు
కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : ముంబయి- చెన్నై- ముంబయి మధ్య వారానికి మూడుసార్లు నడుస్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22157/22158) రైలు ఈనెల 12వ తేదీ నుంచి ప్రతిరోజు పరుగులు తీయనుంది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ రైలు ముంబయిలో ఈనెల 12వ తేదీ రాత్రి 10.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.14 గంటలకు ఎర్రగుంట్లకు చేరుకుంటుంది. కడపకు 4.53, చెన్నై- ఎగ్మోర్‌కు రాత్రి 10.15 గంటలకు చేరుతుంది. చెన్నై- ఎగ్మోర్ నుంచి ముంబయికి వెళ్లే రైలు ఈనెల 15న చెన్నై ఎగ్మోర్ నుంచి ఉదయం 6.20 గంటలకు బయలుదేరి కడపకు అదేరోజు ఉదయం 10.58 గంటలకు చేరుకుంటుంది. ఎర్రగుంట్లకు 11.34 గంటలకు ముంబయికి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు చేరుతుంది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా వారానికి మూడురోజులపాటు నడుస్తోంది. ఎక్కువ రద్దీ ఉండడంతో రైల్వే బోర్డు ప్రతిరోజు ఈ రైలును నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగా రైల్వే అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రైలును 1-టూ టైర్, 4-త్రీటైర్, , 8-స్లీపర్, 2-జనరల్ మొత్తం 15 కోచ్‌లతో నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతిరోజు సూపర్‌ఫాస్ట్ రైలును నడుపుతున్నామని, సద్వినియోగం చేసుకోవాలని కడప రైల్వే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టరు డి.ఎన్.రెడ్డి, చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టరు ఎం.యానాదయ్య తెలిపారు.
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.