logo
Published : 06/12/2021 03:18 IST

ట్రాక్టర్ల బారులు

నందలూరు మండలంలోని ఆడపూరు ఇసుక క్వారీలో 15 రోజుల అనంతరం ఆదివారం నుంచి ఇసుక విక్రయాలు ప్రారంభించారు. దీంతో ఇన్నాళ్లు ఇసుక కోసం ఎదురుచూస్తున్న వారంతా కొనేందుకు పోటీపడ్డారు. వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు ఒకేసారి వరుసకట్టాయి. మండల కేంద్రం నందలూరు మీదుగా బారులుతీరాయి. దీంతో నందలూరు గ్రామంలోని బస్టాండు కూడలి, రామాపురం చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గంగమ్మ విగ్రహం వద్ద గ్రామస్థులు ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. చెయ్యేరు వరదలతో ఎన్నో గ్రామాలు కొట్టుకుపోయి పలువురు మరణించారు.. బాధితులు పూర్తిగా కోలుకోకుండానే పరివాహక గ్రామాల నుంచి ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వం ఇసుక రవాణా ప్రారంభించడం దారుణమని నిలదీశారు. ఈ మార్గంలో ఇసుక తరలిస్తే ఊరుకునేది లేదని వాహనచోదకులను హెచ్చరించారు. - న్యూస్‌టుడే, నందలూరు

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని