logo

‘కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతున్న కేంద్రం’

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజల సంపదను కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి ఆరోపించారు. ఆదివారం కడప ప్రెస్‌క్లబ్‌లో ఏఐటీయూసీ నగర మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా

Published : 06 Dec 2021 03:18 IST


మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి

కడప(చిన్నచౌకు), న్యూస్‌టుడే : కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజల సంపదను కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి ఆరోపించారు. ఆదివారం కడప ప్రెస్‌క్లబ్‌లో ఏఐటీయూసీ నగర మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డును తీసుకురావాలని డిమాండు చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ఇంధన ధరలు తగ్గించాలని కోరారు. అనంతరం ఏఐటీయూసీ నగర కమిటీని ఎన్నుకున్నారు. నగర అధ్యక్షుడిగా సుబ్బరాయుడు, కార్యదర్శి మద్దిలేటి, ఉపాధ్యక్షులుగా శాంతమ్మ, మల్లేష్‌రెడ్డి, ఆర్‌.బాబు, రామారావు, రమణ, సహకార్యదర్శులుగా కామాక్షమ్మ, మహబూబ్‌ బాషా, నారాయణ, హుస్సేన్‌ను ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని