logo

ముస్లిం తొలి కథానికుడు సత్యాగ్ని

తెలుగు సాహిత్యంలో ముస్లింల జీవిత స్థితిగతులను మైనార్టీ వాదం ఏర్పడక మునుపే కథల ద్వారా వెలుగులోకి తెచ్చిన ముస్లింవాద పితామహుడు షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని అని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. ఆదివారం సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన

Published : 06 Dec 2021 03:18 IST


మాట్లాడుతున్న బుద్ధప్రసాద్‌

యోవేవి(కడప), న్యూస్‌టుడే : తెలుగు సాహిత్యంలో ముస్లింల జీవిత స్థితిగతులను మైనార్టీ వాదం ఏర్పడక మునుపే కథల ద్వారా వెలుగులోకి తెచ్చిన ముస్లింవాద పితామహుడు షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని అని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. ఆదివారం సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో కేంద్రం బాధ్యుడు మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని రచించిన దివార్‌ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. సత్యాగ్నిలో కవి, నటుడు, పాత్రికేయుడు, కథకుడు, రాజకీయనాయకుడు తదితర వివిధ కోణాలున్నాయన్నారు. కార్యక్రమంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆచార్యులు మధుజ్యోతి, సాహిత్య విమర్శకులు తవ్వా వెంకటయ్య, రచయితలు, కవులు పుత్తా పుల్లారెడ్డి, పుత్తా బాలిరెడ్డి, ఓబుళరెడ్డి, జానమద్ది విజయభాస్కర్‌, మాచిరెడ్డి, సంజీవమ్మ, అలపర్తి పిచ్చయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని