logo

AP News: సీమకు ‘తీపి’ కబురు..!

చాక్లెట్ల తయారీలో వినియోగించే కోకో కాయలు రాయలసీమలో కూడా కాశాయి.

Updated : 11 Jan 2022 11:43 IST

చాక్లెట్ల తయారీలో వినియోగించే కోకో కాయలు రాయలసీమలో కూడా కాశాయి. మన రాష్ట్రంలో కోస్తా ప్రాంతంలో కొబ్బరి తోటల్లో దీన్ని అంతర పంటగా సాగు చేస్తున్నారు. నల్లరేగడి, ఎర్రనేలలు దీనికి అనుకూలం. రాయలసీమలో ఎర్రగరప నేలలు ఎక్కువగా ఉన్నందున ఎక్కడా ఇంతవరకు ఈ మొక్కలు లేవు. కడప జిల్లా రైల్వేకోడూరులోని అనంతరాజుపేట ఉద్యాన కళాశాలలో దీన్ని ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు. ఇక్కడ 70 వరకు మొక్కలు నాటగా అన్నీ బాగా పెరిగి ప్రస్తుతం కాయలు కాశాయని ఉద్యాన పరిశోధన కేంద్రం ప్రొఫెసర్‌ యువరాజు తెలిపారు. దిగుబడి, కాయ నాణ్యత బాగుందని.. లోపల కోకో గింజల నాణ్యతపై పరిశోధన చేస్తున్నట్లు వెల్లడించారు. ఫలితాలు సంతృప్తిగా వస్తే రైతులకు విత్తనాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.
- ఈనాడు, కడప 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని