logo

నిధుల స్వాహాపై కదిలిన యంత్రాంగం

అట్లూరు మండలం వైఎస్‌ఆర్‌ క్రాంతి పథంలో స్త్రీనిధి నిధుల దుర్వినియోగంపై గతంలో పనిచేసిన అధికారులతోనే వసూలు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. గత నెల 20న ఈనాడు ‘క్రాంతి పథంలో కారు చీకట్లు’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. గత నెల 29న

Published : 15 Jan 2022 02:25 IST

అట్లూరు, న్యూస్‌టుడే : అట్లూరు మండలం వైఎస్‌ఆర్‌ క్రాంతి పథంలో స్త్రీనిధి నిధుల దుర్వినియోగంపై గతంలో పనిచేసిన అధికారులతోనే వసూలు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. గత నెల 20న ఈనాడు ‘క్రాంతి పథంలో కారు చీకట్లు’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. గత నెల 29న జిల్లా కార్యాలయంలో పీడీ ఆధ్వర్యంలో అట్లూరు నిధుల దుర్వినియోగంపై ఏరియా కోఆర్డినేటరు అశోక్‌కుమార్‌రెడ్డి, ఏపీఎం వెంకటసుబ్బమ్మ, సంబంధిత సీసీలు, సిబ్బందితో విచారణ చేపట్టారు. నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని పీడీ ఆదేశించినట్లు తెలిసింది. మండల స్థాయిలో అమలు కాలేదు. పలురకాల వత్తిళ్ల మేరకు ఏపీఎం బదిలీ తీవ్ర స్థాయిలో ప్రయత్నించి ప్రొద్దుటూరుకు బదిలీపై వెళ్లారు. కుంభగిరి క్లష్టరు సీసీగా ఉన్న రమణను ఉన్నతాధికారులు కలసపాడుకు బదిలీ చేసారు. ఆ స్థానంలో రెడ్డిపల్లెలో నిధుల దుర్వినియోగం అయిన కాలంలో పనిచేసిన సీసీ రవికుమార్‌ను నియమించారు. మండల ఏపీఎంగా గతంలో పనిచేసి వెళ్లిన వెంకటసుబ్బారెడ్డి అట్లూరు అదనపు, బద్వేలు ఏరియా కోఆర్డినేటరుగా పూర్తి బాధ్యతలు నిర్వహించనున్నారు. రెడ్డిపల్లెలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి బదిలీపై వచ్చిన రవికుమార్‌ ద్వారా రికవరీ చర్యలు చేపడుతున్నట్లు ఏరియా కోఆర్డినేటరు వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని