logo

భోగి మంటల్లో సీఎస్‌ కమిటీ పీఆర్సీ నివేదిక

సీఎస్‌ కమిటీ పీఆర్సీ నివేదిక ప్రతులను యూటీఎఫ్‌ నాయకులు శుక్రవారం భోగి మంటల్లో వేసి దహనం చేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా మాట్లాడుతూ అశుతోష్‌మిశ్రా నివేదిక మాయం చేసి సీఎస్‌ రిపోర్ట్‌ పీఆర్సీ అమలు చేయడమంటే ఉద్యోగులు, ఉపాధ్యాయుల చెవుల్లో పూలుపెట్టడమేనన్నారు. బకాయి

Published : 15 Jan 2022 02:25 IST


నివేదిక ప్రతులను దహనం చేసి నినాదాలు చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

కడప విద్య, న్యూస్‌టుడే : సీఎస్‌ కమిటీ పీఆర్సీ నివేదిక ప్రతులను యూటీఎఫ్‌ నాయకులు శుక్రవారం భోగి మంటల్లో వేసి దహనం చేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా మాట్లాడుతూ అశుతోష్‌మిశ్రా నివేదిక మాయం చేసి సీఎస్‌ రిపోర్ట్‌ పీఆర్సీ అమలు చేయడమంటే ఉద్యోగులు, ఉపాధ్యాయుల చెవుల్లో పూలుపెట్టడమేనన్నారు. బకాయి డీఏలు ఇచ్చి జీతాలు ఎవరికీ తగ్గవని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రివిజన్‌ కమిషన్‌ అంటే ఉన్న జీతం పెరగాలి తప్పా, తగ్గడమనేది పీఆర్సీ చరిత్రలో ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. పీఆర్సీ రద్దు చేసే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20న కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి, 28న చలో విజయవాడ కార్యక్రమాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు రవికుమార్‌, సహాధ్యక్షురాలు రూతుఆరోగ్యమేరి, జిల్లా ఆర్థిక కార్యదర్శి మహేష్‌బాబు, జిల్లా కార్యదర్శులు దావుద్దీన్‌, సీపీఎస్‌ జిల్లా కన్వీనర్‌ మురళి, జిల్లా ఆడిట్‌ కన్వీనర్‌ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని