logo

భోగి మంటల్లో ఓటీఎస్‌ ప్రతుల దగ్ధం

ఓటీఎస్‌ పేరుతో గృహ నిర్మాణ లబ్ధిదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. బలవంతపు వసూళ్లు చేయలేదని ఒకవైపు చెబుతున్నా లక్ష్యాలను చేరుకోవాలంటూ అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

Published : 15 Jan 2022 02:25 IST


ఖాజీపేట మండలం దుంపలగట్టులో భోగి మంటల్లో ఓటీఎస్‌ ఉత్తర్వు ప్రతులను దహనం చేస్తున్న తెదేపా నాయకులు

ఖాజీపేట, జమ్మలమడుగు : ఓటీఎస్‌ పేరుతో గృహ నిర్మాణ లబ్ధిదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. బలవంతపు వసూళ్లు చేయలేదని ఒకవైపు చెబుతున్నా లక్ష్యాలను చేరుకోవాలంటూ అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. భోగి సందర్భంగా శుక్రవారం ఖాజీపేట మండలం దుంపలగట్టులో తెదేపా నాయకులు ఓటీఎస్‌ ఉత్తర్వు ప్రతులను దగ్ధం చేశారు. పీఆర్సీ సమస్యల పరిష్కారంలో భాగంగా ఫ్యాప్టో పిలుపు మేరకు శుక్రవారం యూటీఎఫ్‌ కార్యాలయం వద్ద భోగీ మంటల్లో సీఎస్‌ కమిటీ పీఆర్సీ నివేదికను పడేసినట్లు జిల్లా కార్యదర్శి నాగార్జునరెడ్డి జమ్మలమడుగులో తెలిపారు. ఈ నెల 20వ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముట్టడి, 28వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మురళీకృష్ణ, రవిశంకర్‌, మహమ్మద్‌ రఫీ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని