logo

వరదబాధితులకువేగంగా ఇళ్ల నిర్మాణాలు

అన్నమయ్య జలాశయం కట్ట తెగి వచ్చిన వరద ఉద్ధృతికి సర్వం కోల్పోయిన వరద బాధితులు నెమ్మదిగా కోలుకుంటున్నారు. దాతలు ముమ్మర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ధైర్యం నింపుతున్నారు. వరద అనంతరం ప్రభావిత గ్రామాల్లో సీఎం జగన్‌ పర్యటన అనంతరం ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇళ్లు నిర్మించి

Published : 15 Jan 2022 02:34 IST


పునాదులు తీస్తున్న యంత్రం

రాజంపేట గ్రామీణ న్యూస్‌టుడే: అన్నమయ్య జలాశయం కట్ట తెగి వచ్చిన వరద ఉద్ధృతికి సర్వం కోల్పోయిన వరద బాధితులు నెమ్మదిగా కోలుకుంటున్నారు. దాతలు ముమ్మర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ధైర్యం నింపుతున్నారు. వరద అనంతరం ప్రభావిత గ్రామాల్లో సీఎం జగన్‌ పర్యటన అనంతరం ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడంతో అధికారులు నిర్మాణ పనులు ముమ్మరంగా చేస్తున్నారు. పులపుత్తూరు గ్రామంలో దాదాపు 323 ఇళ్లు పూర్తిగా పాక్షికంగా దెబ్బతిన్నాయి. గ్రామంలోని హరిజనవాడ, అరుంధతివాడల్లో ఎక్కువ నష్టం జరిగింది. ప్రస్తుతం బాధితులు తాత్కాలికంగా గుడెసెలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

పులపుత్తూరు, చింతలకోన, నూతుపల్లి గ్రామాల్లోని 288 ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పనులు సాగుతున్నాయి. 25 ఎకరాల్లో వీటిని నిర్మిస్తున్నారు. ఇంటి నిర్మాణ పనులను బెంగుళూరుకు చెందిన ఇంటి సంస్థకు అప్పజెప్పారు. హరిజనవాడ, ఆరుంధతివాడలకు వేరువేరుగా లేఅవుట్లు వేసిన అధికారులు, ప్రజలకు నచ్చిన ఆకృతిలో నిర్మాణాలు చేస్తున్నారు.

మౌలిక వసతుల కల్పన..

తాగు నీటి కల్పన కోసం రూ.20 లక్షల నిధులతో అయిదు బోర్లు వేశారు. వాటికి అవసరమైన విద్యుత్‌ లైన్ల పనులు పూర్తయ్యాయి. లేఅవుట్ల అనుసంధాన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ పనులు ఇప్పటికే పూర్తి చేశారు.

త్వరితగతిన పూర్తి చేస్తాం..

పులపుత్తూరు గ్రామంలో 25 ఎకరాల్లో ఇంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పునాది పనులు పూర్తయ్యాయి. బెంగళూరుకు చెందిన గుత్తేదారు సంస్థ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. నాలుగు నెలల్లో ఇళ్లు పూర్తి చేసి వరద బాధితులకు ఇస్తాం. - హౌసింగ్‌ డీఈ మురళి

లే అవుట్లలో నీటి సౌకర్యం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని