logo

20న కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏకపక్షంగా ప్రకటించిన పీఆర్సీని సవరించి ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్‌ కన్నా అధికంగా ఇవ్వాలని, లేనిపక్షంలో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ వెంకటసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించాలని

Published : 17 Jan 2022 04:30 IST


ప్రసంగిస్తున్న ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ వెంకటసుబ్బారెడ్డి

కడప విద్య, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏకపక్షంగా ప్రకటించిన పీఆర్సీని సవరించి ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్‌ కన్నా అధికంగా ఇవ్వాలని, లేనిపక్షంలో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ వెంకటసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేస్తూ కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని ఈ నెల 20న కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి, 28న చలో విజయవాడ నిర్వహించనున్నామన్నారు. శనివారం స్థానిక సీఎస్‌ఐ పాఠశాలలో ఫ్యాప్టో సర్వసభ్య సంఘాలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పీఆర్సీ, సకాలంలో డీఏలు, వారంలో సీపీఎస్‌ రద్దు తదితర హామీలు ఇచ్చారన్నారు. మూడేళ్లుగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. 23 శాతం ఫిట్‌మెంట్‌ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ముఖ్యమంత్రి పునరాలోచించి ఐఆర్‌ కన్నా ఎక్కువ ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ హరిబాబు, కోఛైర్మన్లు రమణారెడ్డి, అబ్దుల్లా, నాయకులు మహేష్‌బాబు, గుర్రయ్య, ఇక్బాల్‌, ప్రభాకర్‌, సురేష్‌బాబు, దావుద్దీన్‌, కేఎల్‌ఎన్‌ శాస్త్రి, రాజశేఖర్‌, షాహిదుల్లా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని