logo

తెదేపా ఫ్లెక్సీలు తొలగించడం దారుణం : ఎమ్మెల్సీ

తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేయమని పోలీసులను డీజీపీ ఏమైనా ఆదేశించారా అన్ని ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. పులివెందులలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గత తెదేపా, ప్రస్తుత వైకాపా ప్రభుత్వ పాలనలో పెరిగిన

Published : 17 Jan 2022 04:30 IST


మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి

పులివెందుల, వేంపల్లె, న్యూస్‌టుడే: తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేయమని పోలీసులను డీజీపీ ఏమైనా ఆదేశించారా అన్ని ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. పులివెందులలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గత తెదేపా, ప్రస్తుత వైకాపా ప్రభుత్వ పాలనలో పెరిగిన నిత్యావసర ధరల వ్యత్యాసం చూపిస్తూ నియోజకవర్గంలో తెదేపా ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేస్తే వాటిని తొలగించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడటం దారుణమని ఆరోపించారు. పెరిగిన సరకుల ధరల తగ్గించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫ్లెక్సీలు కూడా వైకాపా నాయకులు, పోలీసులు తొలగించి ఉంటే సెల్యూట్‌ చేసే వాడినని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వాటిని ఏర్పాటు చేసేందుకు వీలు లేదని పోలీసు అధికారం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు పూర్తి అన్యాయం చేస్తోందన్నారు. వ్యవసాయ పరికరాలు ఇవ్వడం లేదని దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో తెదేపా నాయకత్వ శిక్షణ శిబిరం రాయలసీమ డైరెక్టర్‌ రాంగోపాల్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీరపునాయునిపల్లె మండలం ముతుకూరు గ్రామానికి చెందిన మధన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని