logo

చౌటపల్లె ఎడ్లకు ప్రథమ బహుమతి

సంక్రాంతిని పురస్కరించుకుని నరహరిపురంలో నిర్వహించిన బండలాగుడు పోటీల్లో ప్రొద్దుటూరు మండలం చౌటపల్లె ఎడ్లు ప్రథమ బహుమతిగా రూ.1,10,116 నగదును అందుకున్నాయి. ఆదివారం సీనియర్‌ వృషభరాజములచే బండలాగుడు పోటీలు నిర్వహించారు.

Published : 17 Jan 2022 04:30 IST


వెదురూరులో ఎడ్ల వెంట పరుగులు తీస్తున్న జనం

చాపాడు, న్యూస్‌టుడే: సంక్రాంతిని పురస్కరించుకుని నరహరిపురంలో నిర్వహించిన బండలాగుడు పోటీల్లో ప్రొద్దుటూరు మండలం చౌటపల్లె ఎడ్లు ప్రథమ బహుమతిగా రూ.1,10,116 నగదును అందుకున్నాయి. ఆదివారం సీనియర్‌ వృషభరాజములచే బండలాగుడు పోటీలు నిర్వహించారు. రెండో బహుమతి కర్నూలు జిల్లా డోన్‌ మండలం కొత్తకోటకు చెందిన గురునాథ్‌ ఎడ్లు రూ.75,016 సాధించాయి. మూడో బహుమతి అనంతపురం జిల్లా యాడికి మండలం కోనఉప్పలపాడుకు చెందిన కులశేఖర్‌రెడ్డి ఎడ్లు రూ.40,016 పొందాయి. నాలుగో బహుమతి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజుపల్లికి చెరదిన సోహిత్‌రెడ్డి ఎడ్లు రూ.20,016 అందుకున్నాయి. ఐదో బహుమతి కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన రామ్మోహన్‌ ఎడ్లు రూ.10,016 పొందాయి. ఆరో బహుమతి పాణ్యం మండలం ఎస్‌.కొత్తూరుకు చెందిన బీఎస్‌ఎస్‌రెడ్డి ఎడ్లు రూ.5,016 సాధించాయి. వెదురూరులో జరిగిన పోటీల్లో మొత్తం 14 జతల ఎడ్లు పాల్గొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని