logo

తెలుగు ప్రముఖుడు వెంకటరమణ మృతికి సంతాపం

యలహంక ప్రభుత్వ తెలుగు పాఠశాల వ్యవస్థాపకుడు, నగరసభ మాజీ కౌన్సెలర్‌ కె.వి.వెంకటరమణ (78) శనివారం మధ్యాహ్నం మృతిచెందారు. ఆయన మృతికి స్థానిక తెలుగు ప్రముఖులతో పాటు స్థానిక శాసనసభ్యుడు ఎస్‌.ఆర్‌. విశ్వనాథ్‌, సింగనాయకనహళ్లి

Published : 17 Jan 2022 04:30 IST


కేవీ వెంకటరమణ (పాతచిత్రం)

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : యలహంక ప్రభుత్వ తెలుగు పాఠశాల వ్యవస్థాపకుడు, నగరసభ మాజీ కౌన్సెలర్‌ కె.వి.వెంకటరమణ (78) శనివారం మధ్యాహ్నం మృతిచెందారు. ఆయన మృతికి స్థానిక తెలుగు ప్రముఖులతో పాటు స్థానిక శాసనసభ్యుడు ఎస్‌.ఆర్‌. విశ్వనాథ్‌, సింగనాయకనహళ్లి రైతు సేవా సహకార బ్యాంకు అధ్యక్షురాలు వాణీశ్రీ భాజపా ప్రధాన కార్యదర్శి వీవీరామమూర్తి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కడప జిల్లా రాయచోటికి చెందిన ఆయన, బతుకుదెరువు కోసం యలహంకకు వచ్చి చేనేత మగ్గాల కార్మికుడిగా, అనంతరం మగ్గాల యజమానిగా పలువురికి ఉపాధి కల్పించారు. తెలుగు భాషపై అభిమానంతో 17ఏళ్ల క్రితం రూ.లక్ష విలువ చేసే భూమిని తెలుగు పాఠశాలకు ఉచితంగా ఇవ్వడంతో పాటు పాఠశాల భవనాన్ని నిర్మించారు. కొండప్పలేఔట్‌లో తెలుగు ఉన్నత పాఠశాల కోసం సొంత భూమిలో మూడు అంతస్తుల పాఠశాలను నిర్మించారు. ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో ఉన్న యలహంకలో వారి పిల్లలు మాతృభాషలో చదువు సాగించేందుకు తెలుగు పాఠశాలను ప్రారంభించి అభివృద్ధి చేసిన ఘనత కేవీ వెంకటరమణకు దక్కుతుందని స్థానిక తెలుగు ప్రముఖులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని