logo

పశువుల మేత స్థలంలో ప్లాట్లు వేయడం తగదు

మూడు గ్రామాలకు సంబంధించిన పశువులు, జీవాలు మేత కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని టౌన్‌షిప్‌ ప్లాట్లు వేసేందుకు అమ్ముకోవడం తగదని పట్టణ సమైక్య రాష్ట్ర కమిటీ సభ్యుడు సత్యనారాయణ, రాయచోటి కన్వీనర్‌ ఎ.రామాంజులు పేర్కొన్నారు.

Published : 17 Jan 2022 04:30 IST


టౌన్‌షిప్‌కు కేటాయించిన భూమిని పరిశీలిస్తున్న కమిటీ సభ్యులు

రాయచోటి, న్యూస్‌టుడే: మూడు గ్రామాలకు సంబంధించిన పశువులు, జీవాలు మేత కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని టౌన్‌షిప్‌ ప్లాట్లు వేసేందుకు అమ్ముకోవడం తగదని పట్టణ సమైక్య రాష్ట్ర కమిటీ సభ్యుడు సత్యనారాయణ, రాయచోటి కన్వీనర్‌ ఎ.రామాంజులు పేర్కొన్నారు. ఆదివారం కమిటీ సభ్యులతో కలిసి టౌన్‌షిప్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. క్యాటిల్‌ గైజింగ్‌కు కేటాయించిన భూమిని ప్రజలకు కట్టబెట్టి వ్యాపారం చేయాలనుకోవడం మోసం చేయడం కాదా అని వారు ప్రశ్నించారు. ఇటువంటి భూమిని ప్రజా అవసరాల కోసం వినియోగించాలని 2011లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాగబసిరెడ్డి, వినయ్‌కుమార్‌, మాదవయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు