logo

సమాజ అభ్యున్నతికి కవిరాజు కృషి

కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సమాజ అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య తెలిపారు. త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Published : 17 Jan 2022 04:30 IST


మాట్లాడుతున్న ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, చిత్రంలో పోలీసులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సమాజ అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య తెలిపారు. త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపురనేని రామస్వామి చౌదరి కృష్ణా జిల్లా అంగలూరులోని ఓ రైతు కుటుంబంలో జన్మించారని పేర్కొన్నారు. ఆయన చదువుకుంటూనే రాసిన రాణాప్రతాప్‌ నాటకాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించిందన్నారు. తెలుగులో సాంస్యృతిక విప్లవానికి నాంది పలికారని పేర్కొన్నారు. 1943లో తుది శ్వాస విడిచారని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌.ఐ.లు మహబూబ్‌బాషా, వీరేష్‌, సోమశేఖర్‌ నాయక్‌, ఆర్‌ఎస్సైలు సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని