logo

అటవీ తనిఖీ కేంద్రాల్లో అసౌకర్యాల తిష్ట

ఎర్ర చందనం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ఏర్పాటు చేసిన అటవీశాఖ తనిఖీ కేంద్రాలు కనీస వసతులకు దూరంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ విధులు నిర్వర్తించే పోలీసు, అటవీశాఖ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో ప్రొద్దుటూరు, కడప

Published : 17 Jan 2022 04:30 IST

టేకూరుపేట అటవీ చెక్‌పోస్టు. కడప, నెల్లూరు జిల్లాలకు సరిహద్దులో ఉంది. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు సరిగా పనిచేయవు. ఇద్దరు ప్రొటెక్షన్‌ వాచర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఎఫ్‌బీవోకు కోర్టు పనులు అప్పగించారు. కోర్టు పనులు చూసుకొని ఇక్కడ విధులకు హాజరవుతున్నారు. 

బద్వేలు, పోరుమామిళ్ల న్యూస్‌టుడే ఎర్ర చందనం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ఏర్పాటు చేసిన అటవీశాఖ తనిఖీ కేంద్రాలు కనీస వసతులకు దూరంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ విధులు నిర్వర్తించే పోలీసు, అటవీశాఖ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో ప్రొద్దుటూరు, కడప రాజంపేటలో మూడు అటవీశాఖ డివిజన్లు ఉన్నాయి. ఈ మూడు డివిజన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు అటవీశాఖ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజను పరిధిలో ఎనిమిది తనిఖీ కేంద్రాలు నడుస్తున్నాయి. పోరుమామిళ్ల అటవీశాఖ రేంజిలో టేకూరుపేట, రామేశ్వరం, జ్యోతి, బద్వేలు రేంజిలో పీపీ కుంట, వనిపెంట రేంజిలో మైదుకూరు, ప్రొద్దుటూరు రేంజిలో కూడలి, ముద్దనూరు రేంజిలో కమలాపురం హైవే రోడ్డుపై తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 24 గంటలు అటవీశాఖ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అరుదైన ఎర్రచందనం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ఈ కేంద్రాల సిబ్బంది కృషి చేస్తున్నారు. అయినా వీటిలో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ఉన్నతాధికారులు అనేక పర్యాయాలు వీటిని తనిఖీ చేస్తున్నారు. అయినా మౌలిక సౌకర్యాలు కల్పించటానికి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎఫ్‌ఆర్వో మధుబాబు వద్ద ప్రస్తావించగా నూతన అటవీశాఖ తనిఖీ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు.

బద్వేలు అటవీశాఖ రేంజి పరిధిలోని పీపీ కుంట ఫారెస్టు తనిఖీ కేంద్రం. ఇక్కడ ఎర్రచందనం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు అటవీ, పోలీసు శాఖ సిబ్బంది 24 గంటలు విధులు నిర్వర్తిస్తుస్తున్నారు. అయినా కేంద్రం కనీస సౌకర్యాలు లేని రేకులషెడ్డులో నడుస్తోంది. ఒక్కోసారి మహిళా అటవీశాఖ ఉద్యోగులు కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మూత్రశాల, మరుగుదొడ్లు లేవు. ఈ షెడ్డు వర్షానికి ఉరుస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడి మరుగుదొడ్డి శిథిలావస్థకు చేరంది. దీంతో ఇది వినియోగంలోలేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని