logo

డిగ్రీ, పీజీ విద్యార్థులకు కంప్యూటర్‌ కోర్సులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ పీజీ కళాశాలల విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులోకి తెచ్చినట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం(యోవేవి) కులసచివులు విజయరాఘవప్రసాద్‌ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, అఫిలియేటెడ్‌

Published : 21 Jan 2022 01:56 IST

4 వేల మంది విద్యార్థులకు అవకాశం

మాట్లాడుతున్న రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌

యోవేవి(కడప), న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ పీజీ కళాశాలల విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులోకి తెచ్చినట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం(యోవేవి) కులసచివులు విజయరాఘవప్రసాద్‌ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, అఫిలియేటెడ్‌ కళాశాలల ప్రధానాచార్యులతో వర్చువల్‌ విధానంలో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి జిల్లా నుంచి డిగ్రీ, పీజీ కోర్సులు చదివే 4 వేల మంది విద్యార్థులకు ఇందులో ప్రవేశాలు ఉంటాయన్నారు. భవిష్యత్తు ఉద్యోగాల కల్పనకు ఉపయుక్తమయ్యే 45 కోర్సులు ఉన్నాయన్నారు. కోర్సు పూర్తయ్యాక పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే మైక్రోసాఫ్ట్‌ కంపెనీ నుంచి సర్టిఫికెట్‌ జారీ చేస్తారన్నారు. మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికెట్‌ కోర్సుల యోవేవి నోడల్‌ అధికారి పి.రెడ్డయ్య మాట్లాడుతూ.. అధునాతన కంప్యూటర్‌ కోర్సులకు ఉచితంగా ఆన్‌లైన్‌లో నిపుణులు శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు చంద్రమతి శంకర్‌, ప్రొద్దుటూరు ఇంజినీరింగ్‌ కళాశాల నోడల్‌ అధికారి కిరణ్‌, జిల్లాలోని అన్ని కళాశాలల ప్రధానాచార్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని