logo

కొత్తనోట్లు ఇప్పిస్తానంటూ వృద్ధురాలికి టోకరా

బ్యాంకు వాళ్లు నీకు పాతనోట్లు ఇచ్చారు.. నేను కొత్తనోట్లు ఇప్పిస్తానని చెప్పి ఓ మోసగాడు వృద్ధురాలి నుంచి నగదు కాజేసిన ఘటన రామాపురంలోని ఎస్‌బీఐలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని బండపల్లె పంచాయతీ వెంకటరెడ్డిగారిపల్లెకు చెందిన చిన్నక్క

Published : 21 Jan 2022 01:56 IST

మోసపోయిన వృద్ధురాలు

రామాపురం, న్యూస్‌టుడే : బ్యాంకు వాళ్లు నీకు పాతనోట్లు ఇచ్చారు.. నేను కొత్తనోట్లు ఇప్పిస్తానని చెప్పి ఓ మోసగాడు వృద్ధురాలి నుంచి నగదు కాజేసిన ఘటన రామాపురంలోని ఎస్‌బీఐలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని బండపల్లె పంచాయతీ వెంకటరెడ్డిగారిపల్లెకు చెందిన చిన్నక్క అనారోగ్యంగా ఉండడంతో వైద్య ఖర్చుల కోసం గురువారం రామాపురంలోని బ్యాంకుకు వెళ్లి రూ.50 వేల నగదు తీసుకున్నారు. అక్కడే పొంచి ఉన్న ఓ ఆగంతుకుడు నీకు పాతనోట్లు ఇచ్చారు, వీటిని మార్చి కొత్తవి తెచ్చిస్తానని చెప్పి ఆమె నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. అందులో సగం డబ్బు జేబులో పెట్టుకుని మిగతా సగం ఆమెకే ఇచ్చి కౌంటర్‌ దగ్గరికి వెళ్లి కొత్తనోట్లు తీసుకోమని చెప్పాడు. దీంతో చిన్నక్క క్యాషియర్‌ వద్దకు వెళ్లి కొత్త నోట్లు ఇవ్వలని కోరారు. ఆయన రూ.25 వేలే ఉన్నాయి, మిగతా రూ.25 వేలు ఎక్కడని అడగడంతో ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. చుట్టూ వెతికినా మోసగాడు కనిపించకపోవడంతో బ్యాంకు సిబ్బంది సీసీ కెమెరా పుటీజీలను పరిశీలించారు. అతను బ్యాంకు నుంచి బయటికి వెళ్లిపోయినట్లు కనిపించడంతో బాధితురాలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని