logo

గండికోటలో 32 అడుగులఅంజన్న విగ్రహం

జిల్లాలో ప్రముఖ పర్యటక ప్రాంతమైన గండికోటకు త్వరలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. గండికోటకు 3 కి.మీ దూరంలో ఎత్తైన కొండపై 13 సెంట్ల స్థలంలో సుమారు రూ.30 లక్షలతో 32 అడుగుల వీర అభయ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు

Published : 21 Jan 2022 01:56 IST

నిర్మాణంలో ఉన్న విగ్రహం

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రముఖ పర్యటక ప్రాంతమైన గండికోటకు త్వరలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. గండికోటకు 3 కి.మీ దూరంలో ఎత్తైన కొండపై 13 సెంట్ల స్థలంలో సుమారు రూ.30 లక్షలతో 32 అడుగుల వీర అభయ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అనంతపురానికి చెందిన దాత సుధాబాలరాజు తన సొంత నిధులతో జమ్మలమడుగుకు చెందిన మల్లికార్జున్‌, గండికోట పుష్పాల నరసింహులు, మిత్రబృందం సహకారంతో ఇక్కడ హనుమంతుని ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది శిల్ప కళాకారుల గతేడాది ఆగస్టు నుంచి విగ్రహ తయారీని ప్రారంభించి నిర్మాణాన్ని పూర్తి చేశారు.

ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకే ఏర్పాటు

మాది ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె గ్రామం. వృత్తి రీత్యా అనంతపురంలో స్థిరపడ్డాను. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన పెంపొందించాలనే లక్ష్యంతో సామాజిక సేవ చేస్తున్నా. గండికోటకు ఆధ్యాత్మిక వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో సొంత నిధులతో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నాను. ఇప్పటికి 70 శాతం పనులు పూర్తయ్యాయి. రెండు నెలల్లో మిగిలిన పనులు పూర్తిచేసి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తాం.  - సుధాబాలరాజు, విగ్రహ దాత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని